గ్రామ అభివృద్ది కోసం కేంద్ర మరియు రాష్ట్రప్రభుత్వాలు ఇదివరకు 90 పైచిలుకు ప్రణాళికలను ప్రవేశ పెట్టాయి. కాని గ్రామ అభివృద్ధి లో నిర్దేశిత గమ్యం చేరుకోలేక పోయాం. మనం ఎక్కడ విపలమైనామని ఒక్కసారి వెనుదిరిగి చూడవలసిన అగత్యమున్నది. మన భారత దేశంలో 68 శాతం జనాభా పల్లెలోను 32 శాతం పట్టణాలలో నివసించు చున్నారు. మన దేశంలో 6,32,596 గ్రామాలున్నాయి. ఇటువంటి గ్రామాలలో దాదాపు 44800 గ్రామాల్లో మనుష్యులు లేరు. జనవసతియున్న గ్రామాలు 5,93,731మాత్రమే! .
నిరుపేదలు:2011-12 వ సంవత్సరం లెక్కల ప్రకారం 15.3 శాతం అనగా 19 కోట్లమంది నిరుపేదలు మరియు దారిద్య్ర రేఖకన్న క్రింద బతుకుతున్న జనాభా కలదు. 141 మిలియన్ హెక్టార్ల భూమి సాగుకు ఉపయోగంలో ఉంది. దాన్లో 39 మిలియన్ హెక్టార్ ప్రదేశం మాత్రం సంవత్సరానికి రెండు పైర్లు వేయటానికి పనికి వస్తుంది. మనదేశంలో సుమారు 100 నదులు.ఉపనదులు ఉన్నాయి. .
చిన్నకారురైతులు: ఇంత ఉన్నా మనం ఉద్దేశించిన గురి ఎందుకు చేరలేక పోతున్నాం? కారణాలు: మన సరాసరి భూ మాలికత్వం 1.1 హెక్టార్. ఈ యొక్క లిమిటెడ్ ప్రదేశంలో మన ప్రణాళికలను అమలు చేయు సందర్భాలలో అనేక సవాళ్ళను ఎదుర్కోవలసి వస్తుంది. దీనిలో ముఖ్యంగా చూసినపుడు తక్కువ భూమి, తక్కువ ఆదాయం,పెట్టుబడి పెట్టుటకు గల అవకతవకలు, రైతులకు నిర్దేశించిన ఆదాయం లేకపోవటం పండించిన పంటలకు రెట్లు లేకపోవటం ఉత్పత్తి కి కనిష్ట మద్దతు ధర లేకపోవటం ఇలాంటివని తెలుస్తుంది. ఇవిగాక మోడ్రన్ టెక్నిక్ ఉపయోగంలో ఉన్న పరిమితులు సహా కారణం అని గుర్తించారు.
రైతులకు వ్యవసాయం కాక వెరే ఏ రకమైన ఆదాయం ఉండదు. చాలా రైతులకు పరాంపరా గతంగా యున్న అప్పుల బాధ. ఇవి మన రైతుల సమస్యలు. పండించిన రైతుకు గిట్టుబాటు ధరలు లేక ఇలాంటివి చూచినప్పుడు రైతు భవిష్యత్ ఏమని ఆలోచింప చేస్తుంది. మన దేశంలో వ్యవసాయం ఎక్కువగా వర్షం పై ఆధారపడి యున్నది. వర్షాలు లేనప్పుడు పంటలు పండవు.వర్షం పడి పంట పండినపుడు గిట్టుబాటు ధరలు లేక రైతులు నష్టపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు జీవించటానికి కష్టమౌతుంది. ఇలాంటపుడు ప్రభుత్వాలు అప్పు మన్నా, వడ్డీ మన్నా గిట్టుబాటు ధరలు, పంటనష్టపరిహరం ఇలాంటివి ఇస్తుంటారు. .
శాశ్వతంగా ధీనికి పరిహారం కావాలి: పైన చెప్పుకున్న వన్ని దీనికి పరిహారం కాదు. ఇప్పుడు దీనికి ఆలో చించు సమయం ఆసన్నమైంది. చిన్నాచితక భుమిగల రైతులు, భూములు వాళ్ళ దగ్గర ఉండాలి. వాళ్లకు పెట్టుబడి కానందున చేయు ప్రణాళికలు ఎట్లుండాలి అని ఆలోచించినప్పుడు నాకు స్మార్ట్ విల్లేజ్ ఎకనామిక్ జోన్ (S V E Z) ఆలోచనవచ్చింది. నా ఆలోచన ప్రకారం వివిధ మూలలనుండి ఆదాయం వచ్చు వంటి వ్యవస్థ చేయవచ్చును.ఈ మూలంగా రైతుల జీవితంలో వెలుగు చూడవచ్చును. మన భారత దేశం లో ఒక కుటుంబంలో సామాన్యంగా కనీసం నలుగురు వ్యక్తులు ఉంటారు. వారికి 1.1 హెక్టార్ భుమివలన వచ్చు ఆదాయం లో బ్రతకలేక పట్టంప్రదేశాల కు వలస వెళ్లి అక్కడ కూలిపని చేసుకొని పొట్ట నింపుకొని జీవించవలసిన పరిస్థితి. రైతులకు ఇలాంటి కష్టాలు తప్పించి తమ భుమిలోనే ఎక్కువ దిగుబడి వచ్చే విధంగా మరియు ఉన్నచోటే. ఉద్యోగ,ఉపాధి సృష్టంచడం జరుగుతుంది.
లోకసభ నియోజకవర్గం ఒకయూనిట్: ఈ ప్రణాళిక ఒక లోక సభ నియోజకవర్గము ఒక యూనిట్ గా పరిగణించబడుతుంది.మొదట స్టేజిలో 470 హె. భూమిని పరిగణలోకి తీసుకోవాలి. దానిలో 16.75 హే. పలు రకమైన కష్టార్జితం చేయటానికి వీలుగా మెరుగు పరచవలెను. మిగిలిన 64.25 హే. భూమిలో వ్యవసాయ ఉత్పత్తుల తయారీ చేయవలెను.81 హే. భూమిని గ్రూప్ వ్యవస్థ లోనికి తెచ్చి దానిలో S V E Z స్థాపన చేయవలసి వుంటుంది. మిగిలిన 389 హే. భూమిని వ్యవస్తాపన కార్యముకు ఉపయోగించబడుతుంది.
ఇచ్చట కేంద్ర ప్రభుత్వం యొక్క ‘సెంట్రల్ ప్రొడక్షన్ మరియు రెగ్యులే ట రి అథారిటీ’ వారు ఆమోదించిన కృషి వస్తువుల వ్యవసాయం జరుగుతుంది. దీనివలన నిరాటంకంగా సప్లయ్ యుండుటకు అవకాశం గలదు. వీటన్నింటినీ దేశంలో ని 543 నియోజకవర్గంలోని పట్టణ ప్రదేశాలు మరియు గ్రామీణ ప్రదేశాలు ఉన్నటివంటి 500 నియోజకవర్గం లో లు స్తాపించటాని కి వీలున్నదీ. ఈ పనికి మన G D P లో 1 శాతం డబ్బు చాలు. వీటన్నింటినీ సులువుగా చేయుటకు పెట్టుబడి మరియు సపోర్ట్ కావలసి యున్నది. ప్రస్తుతం కేంద్రం మరియు రాష్ట్రాలనుండి 30 కి పైగా సబ్సిడీ యోజనలున్నాయి. కృషి సంబంధిత అన్ని పనులకు సింగల్ విండో పద్దతి అమలుపరచవలచి యుంటుంది.
S V E Z పద్దతిలో రైతులు భూమియొక్క మాలికత్వం కలిగియుంటారు. అది ఎటువంటి పరిస్థితుల్లో సంఘానికి గాను లేక ప్రభుత్వ ముకు గానీ ట్రాన్స్ఫర్ కాదు అచ్చట కృషి కార్యక్రమాలు చేయటానికి భూమాలికులతో 12 సంవత్సరాల అగ్రిమెంట్ చేయబడుతుంది. దానిలో దాని మైంటైన్ చేసి మిగిలిన సొమ్మును అంటే లాభాల్ని రైతులకు ఇవ్వబడును.అచ్చట పండువంటి పంటలను నేరుగా మార్కెట్కు తరలించ కుండా గోడౌన్ లలో పెట్టవలసి యుండును. దీనికి స్వంతము గా గోడౌన్ లు నిర్మించాలి. ఇచ్చట పంటలను సురక్షితంగా ఉంచుతారు. ఇచ్చట రైతులకు కావలసిన అప్పును ఇప్పించబడుతుంది. దినియొక్క జవబుదారీ అచ్చట అడ్మినిస్ట్రేషన్ చూస్తారు. పండిన పంటను మండలి మూలకంగా అమ్ముటవలన అప్పును అక్కడే తీసుకోగా మిగిలిన సొమ్మును రైతుల ఖాతాలో జమ చేస్తారు. దీని వలన అనేక రకాల ప్రయోజనం రైతులకు కలుగును. మొదటిది వారి భూమిని గ్రూప్ వ్యవస్థలో లోబరుచువలన పెట్టుబడి పెట్టనక్కరలేదు. రెండవది వచ్చిన ఉత్పాదన లో అందరికి పంచటం. అడ్మినిస్ట్రేషన్ మండలిలో రైతు ప్రతినిధులు కూడా ఉంటారు.
ఒక S V E Z ప్రణాళిక నిర్వహణ కు సుమారు 11.6 కోట్లు కావలసియుంటుంది. ఈ డబ్బును వెరే వెరే మూలలనుంచి శేకరించవలసివుంటుంది. పెట్టుబడిదారుల నుండి 3 కోట్లు, కేంద్ర రాష్ట్రాల యొక్క ఫ్లాట్ సబ్సిడీ దొరకును. ఇది ఒకే సారి ఒకే కంతులో ఇస్తారు. ఇది సుమారు 3.5 కోట్లు. ఇదిగాక ఇప్పుడున్నటివంటి సామాన్య సబ్సిడీ యోజనలనుండీ 2.79 కోట్లు తీసుకొనుటకు S V E Z లు అర్హతకలిగియుంటాయి. దీని వలన ప్రభుత్వం 71 లక్షలు మాత్రం అదనంగా ఇవ్వవలసిఉంటుంది
రూఫ్ టాప్ సౌరశక్తి యూనిట్లను నెలగొల్పవలేను. దీనికి 140 లక్ష రూపాయలు కవాలసియుంటుంది. దీనిని B O O T మోడల్ లో నెలగొల్పవలసివున్నది. ఈ రకంగా నేషనల్ హైవే లో నిర్వహించుకున్నారు వ్యవసయరంగానికి అప్పు ఇవ్వు వంటి బ్యాంక్ నుండి 3.2 కోట్లు అప్పు తీసుకొనవలేను. ఇదిగాక వర్కింగ్ క్యాపిటల్ కు 50 లక్షలు కావలెను. ఇవన్నీ చేరి 11.6 కోట్లు.
పెట్టుబడుదారుల లాభం:పెట్టుబడిదారులకు 20 శాతంవరకు లాభం వచ్చు ప్రణాళిక చేయవలెను. ఈ ఆకర్షణ లేకపోతే పెట్టుబడి దారులు ముందుకురారు. ఇక బ్యాంకుల రుణాలు 100 శాతం చెల్లించబడును. బ్యాంకులు ఇప్పుడు 8 లక్ష కోట్లు అప్పులు ఇచ్చూచున్నాయి. దీనిలో 9.6 కోట్లు యోజనకై ఇస్తున్నాయి ఈ యోజన అవది 5 సంవత్సరాలు . ప్రతి సంవత్సరము 600 SVEZలుస్థాపించాలి. ఏకరవారులాభం:. ఒక ఎకరాకు సంవత్సరంలో 1 లక్ష రూపాయలు లెక్కతో 2.5 ఎకరాకు 2.5 లక్షలు లాభం దొరకును. ఖర్చులు తీసిపోగ ఒక S V E Z కు 200 లక్షలు లాభం చేకూరుతుంది.
ముల్టిపర్పొస్ బిల్డింగ్ కాంప్లెక్స్: దీనిలో సుమారు 800 టన్ కృషి ఉత్పత్తులను నిల్వచేవచ్చును. మరియు 200 k w విద్యుత్ ఉత్పాదన సౌరశక్తి పలకుంటాయి. ఇదీ గాక కస్టమ్ హైరింగ్ సెంటర్లు, లాబొరేటరీ, వాతావరణ మాపక కేంద్రం, రైతు మాహితీ కేంద్రం,ఎరువుల సలహా కేంద్రం,ఎరువుల సంగ్రహకెంద్రం వుంటాయి. అధికారుల కోసం అన్ని సౌకర్యాలు గల కన్సల్టింగ్ రూం లు, సదస్యులు చర్చలు నడుపుటకు పెద్ద హాలు మరియు దీన్ని పలురకాల ఉపయోపడేలా డిజైన్ చేయబడుతోంది. కేంద్రంలో, పాడిపంటలు, గొర్రెలు, మేకలు, కోళ్లు, చేపలు పెంచడం, పోషకాల ఉత్పాదన పశు ఆహార తయారీ ఇలాంటి యూనిట్లు యుండును. ఇవన్నీ ఒకే చోట లభ్యమవుతాయి. కాబట్టి ఇది లాభాలకు అవకాశం.
అరణ్యప్రాముఖ్యత: వెనుకటి రోజుల్లో ప్రతి పల్లెలో గుండు తోపులు,చింతతోపులు, తాటి తోపులు ఉండేవి. ఇప్పుడు అదే రీతిలో ప్రతి పల్లె లో తోపులుతిర్మించబడుటకు S V E Zలు కృషీచేయగలవు. ఇచ్చట మంచి రేటుగల చెట్లను పెంచడం వలన 15-20 సంవత్సరాల తరువాత మంచి ఆదాయం ఆర్జించవచ్చును.
S V E Z ల ముఖ్య ద్యేయమనగా ‘ అవి వినియోగదారులకు’ ఇచ్చట మథ్యవర్తిలకు అవకాశం లేదు. ఉత్పత్తులు నేరుగా వినియోగదారులకు నేరుగా చేరటం వలన రైతులకు మంచి రేటు మరియు వినియోగదారు తక్కువ ధరల్లో ఉత్పత్తులు దొరకటం వలన ఇద్దరూ సంతోష పడుదురు
For more information please write to: [email protected]