ఇండోనేషియా దేశం నుండి వచ్చిన థ్రిప్స్ పార్విస్పినస్ అను కీటకం ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రాలలో పండించు ఎర్ర మిర్చి పంటలలో దాదాపు 50 శాతం పంట పాడైపోయినది ,అని అచ్చట కృషి అదికారులు చెపుతున్నారు. ఈ రకమైన కీటకాల భాధకు రసాయనిక మందులు సరియైన పరిహారం కాదు ఎందుకంటే ఇప్పుడు కొన్ని సంత్సరాలపాటు ఈ కీటకములు మందులకు అలవాటుపడి అవి మందుల నిరోధక శక్తిని పెంచుకున్నాయి అని అనిపించక తప్పదు. ఇలాంటి నిరోధక శక్తి పెంచుకోకుండా సకాలంలో నిపుణులు చెప్పినట్టు మిత ప్రమాణంలో మందులు పిచికారి చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది.
ఈ కారణం చేత స్వభావి కం గా త్రిప్స్ పార్విస్పినాస్ కీటకాల బాధకు రంగు జల్లెడలు సహాయపడగలదు. దీన్ని తెలుసుకొన్న తెలంగాణ ప్రభుత్వ అధికారులు స్టిక్కీ ట్రాప్స్ లను ఉపయోగించ కొరకై రైతులకు సూచిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని గణపురం తాలూకాలో పెచ్చు మిర్చి పంటలను వేస్తుంటారు. రైతులు తోటలలో మందుల ఉపయోగంలో అచ్చట అధికారుల మార్గదర్శనం నిరంతర ముందు జాగ్రత్త తీసుకొన వలయునునని అచ్చటి కృషి అధికారి శ్రీ పాలయ్య గారు చెప్పారు. అదే తాలూకాలోని సీతా పురం గ్రామం శ్రీ ఆషాడ సుబ్బయ్యగారు తమ మిర్చి తోటలో రైతులతో కలిసి పరిశీలించారు. తరువాత మాట్లాడిన వారు మిర్చి తోటలలో బ్లాక్ ట్రిప్స్ తామర తీట నివారణకు వైట్ స్టిక్కర్ మరియు బ్లూ స్టిక్కర్ ఉపయోగించవచ్చునని సలహా ఇవ్వటం జరిగింది. మిర్చి తోటలలో పెట్టుటకు బ్యారిక్స్ వైట్ , ఎల్లో, బ్లూ స్టిక్కర్స్ ను వారు రైతుల సమక్షంలో పరిశీలన చేశారు.
ఇలాంటి స్టిక్కీ ట్రాప్లు మిర్చి తోటలకు తగులు రోగాలకు మరియు కీటకాలు నియంత్రించటానికి సహాయపడును అని చెప్పిన ఆయన ఒక ఎకరాకు 50 నుంచి 100 వైట్ స్టిక్కర్స్ మరియు నీలి స్టిక్కర్స్ లను వాడవచ్చునని సలహా ఇచ్చారు. కృషి విశ్వవిద్యాలయం, బెంగుళూరు. ఇచ్చట కీట నిపుణులు శ్రీ ప్రభు శంకర్ గారు దీని గురించి” అగ్రికల్చర్ ఇండియా” తో మాట్లాడుతూ ఇలా చెప్పారు. మిర్చి పంటను భావించు త్రిప్స్ పర్విస్పినస్ నియంత్రణ కై నీలం స్టిక్ ట్రాప్ లు సహకరించును. కాగా వాటిని సరి అయిన ఈ సమయంలో తోటలలో పరచుకొ న వలయును దానివలన కీటకాల బాధ గణనీయంగా తగ్గును అని వారు అన్నారు.
త్రిప్స్ కీటకాల బాధనుంచి చెట్ల పువ్వులు రాలిపోవును. దాని నివారణకై మొగ్గలు వచ్చు సమయంలో పొలంలో నీలం స్టిక్కీ ట్రాప్ లను వేయవలసి ఉంటుంది. దీనివలన రైతులకు కీటకాల బాధ ఎక్కువైన దో లేక తగ్గినదొ తెలుస్తుంది. రైతులు పంట యొక్క ఎదుగుదలను జాగ్రత్తగా గమనిస్తుంటారు దానివలన తక్షణమే సరైన క్రమం తీసుకోవచ్చునని రైతులకు ఆయన సూచించారు. సేంద్రియ కృషి పద్ధతిలో కీటకాల నియంత్రణ కావలసినటువంటి సాధనములుకై రీసెర్చ్ మరియు డెవలప్మెంట్ ను ఎప్పటికప్పుడు నిరంతరంగా బ్యారిక్ కంపెనీ కృషి చేస్తూనే ఉంటుంది అని ఆ కంపెనీ యొక్క ముఖ్యస్తుడు శ్రీ లోకేష్ మక్కమ్ గారు అగ్రికల్చర్ ఇండియా తో చెప్పారు.
వేరే రకం పంటలకు వచ్చు కీటకాల నియంత్రణకు పేపర్ లాగా ఉండు నీలం, తెల్ల మరియు పసుపు పచ్చ స్టిక్ ట్రాప్ లు సహకరించు ను. మిర్చి పంటలకు వచ్చు ట్రిప్స్ పార్విస్పైనస్ కీటకాల బాధకు తెల్ల మరియు నీలం (blue) ట్రాప్లు వాడవచ్చును అని వారు విషిదికరించినారు. స్స్టిక్కీ ట్రాప్ ల ధర కూడా తక్కువ దీని ఉపయోగం వల్ల మందులు వాడటం తగ్గును మొత్తంలో చెప్పాలనుకుంటే కృషి ఖర్చులు తగ్గును. స్టిక్కీ ట్రాప్ లు వాడటం వలన రైతుల ఆరోగ్యం, పంటల ఆరోగ్యం మరియు పర్యావరణ కాలుష్యము లేకుండా యుండునని వారు వివరిచారు. ఎక్కువ వివరాలకు సంప్రదించండి పోన్ నం 9900800033