నోనిమొరిండాసిట్రిఫోలియా పరిచయం

నోనిఅత్యధికపోషకవిలువలుగలపండు,కానీపండినపండునుండిఅసహ్యకరమైనవాసనారావడంవలనగతకొద్దీసంవత్సరాలుగప్రజాదరణతగ్గిపోయింది.నోనిఒకఉష్ణమండలపుపండు.దీనినిసాదరంగాభారతీయముల్బరీ/ మొగలి/మద్దిపళ్ళన్నీవాడుకభాషలోపిలుస్తారు.

నేలమరియువాతావరణం

నోని అన్ని రకాల నేలలోను పెరుగుతుంది. మురుగు నీరు పారేనేలలు అనుకూలము.నొని ఆమ్లతత్వని తట్టుకుని పెరుగగలదు మరియు 20-250 సే0. ఉషోగ్రత, 250- 400 మీ.మీ.సగటు సంవత్సర వర్షపాతం అనుకూల వాతావరణం.

ఋతువు

శీతాకాలంకంటేవేసవికాలంలోపండ్లుఉత్పత్రిఎక్కువగాఉంటుంది. సంవత్సరంపొడవునాపండ్లుఉత్పత్రి,కొత్తఆకులుచిగురిస్తూఉంటుంది.

ప్రవర్తనం

 విత్తనాలు,కాండం, వేరు నుండి ప్రవర్తనం &అంటుతొక్కడం చేయవచ్చు. ప్రవర్తనానికి అనుకూల పద్దతి విత్తనం మరియు కాండం ప్రవర్తనం.

విత్తన ప్రవర్తనం

విత్తనం – విత్తన శుద్దీ – నాటుట

బాగా పండిన ,మెరుగైన పెద్ద పండును విత్తన సేకరణకు ఉపయోగిస్తారు.పండును నీటిలో బాగా శుభ్రం చేసే వాటి గుజ్జును తీసేసి విత్తనాలు మాత్రం సేకరించాలి. తాజా విత్తనాలు ఉపయోగించినటయితే అంకురార్పతి శాతం (మొలకెత్తడం)  ఎక్కువగా ఉంటుంది.

ఒక కిలో బరువు గల నొని పండునుండి సుమారుగాఆ 40,000 విత్తనాలు ఉంటాయి. విత్తనం నాటుట కంటే ముంద విత్తన శుద్దీ చేయాలి. నొనివిత్తన కవచం చాలా కఠినంగా , బిరుతుగా ఉంటుంది. మృదువైన పళ్ళను నీటిలో కలిపి బాగా తిరగొట్టాలీ,అలాచేసినట్టయితే  పేయి కఠిన పోర తొలగిపోయి, అంకురార్పత్రి ఎక్కువగా ఉంటుంది .

పాటింగ్మీడియం (కుండలలోమట్టినింపుట )

కలుపుముక్కలు,నులిపురుగులు(నెమటోడ్స్)లెనిశుభ్రమైనమట్టిని,ఇసుకమరియుసేంద్రీయఎరువుమిశ్రమంకలిపిఉపయోగించాలి. విత్తనాలునాటినవెంటనేపచ్చిలేదా ఎండుటాకులతోకప్పాలి. దీనివలనకలుపురాదు. తేమశాతంఅలాగేఉంటుంది. కుండలనుపాక్షికనీడలోఉంచినట్టయితేఅంకురార్పత్రిమెరుగుగాఉంటుంది.

వేరుచేయటం

  2-12 నెలలు తర్వాత మట్టి కుండల నుండి నొని మొక్కలు వేరుచేసి పొలంలో నాటుకోవాలి. వేరు వ్యవస్థ బాగా బలపడిన తరువాత కాండం ,ఆకులు అభివృద్ధి చెందుతుంది.

కాండం ద్వారా ప్రవర్తనం

       200-400సేo.మీ. గల కాండం ను ప్రవర్తనం కొరకు ఉపయోగిస్తారు. ప్రవర్తన కాండం నుండి 3 వారాలకు  తరువాత వేరుచేసి నాటుకోవాలి.ప్రవర్తన కాండం ను 6-9 వారాలు లేదా అంతకంటే ఎక్కువ రోజులు కుండలో పెంచినట్టయితే వేరుచేసి తరువాత ఆరోగ్యాంగా పెరుగుతాయి.

యాజమాన్య పద్ధతులూ మరియు సస్యరక్షణ

  • ఎరువులుఎక్కువగావాడటంవలన, రసం పీల్చే పురుగులు(పేనుబంక ,తెల్లదోమ,నల్లదోమ ఆకర్షింపబడి , మసితెగులు వచ్చి, కిరణజన్య సంయోగక్రియ జరగదు.
  • అత్యధికతేమ,వర్షపాతం గల ప్రాంతాలలో శిలింద్ర తెగులు , ఆకు మచ్చలు , కాండం కుళ్ళు తెగులు వంటివి ఎక్కువగా వస్తాయి.అలాంటి తెగులు సోకిన మొక్కలువెంటనే తీసి కాల్చేయలీ లేదా శిలింద్ర నాశిని ని పిచికారీ చేయాలి.
  • నులిపురుగులు ( రూట్ నాట్ నెమటోడ్స్ ) నొని పంటను సాధారణంగా,ఎక్కువగా ఆశించని నష్టం కలుగజేస్తుంది. తగిన మోతాదులో ఎరువులు వాడటం, తగిన సమయంలో నీటి తడులు ఇవ్వండం ద్వారా నులిపురుగులు వ్యాప్తిని కొంతవరకు తగ్గించవచ్చు.
  • నోని పంటను పేనుబంక, పొలుసు పురుగులు,నల్ల ముట్టి పురుగులు ,తెల్లదోమ ,తామర పురుగులు మరియు నల్లులు ఎక్కువుగా ఆశించి నష్టాన్ని కలగజేస్తుంది.రసం పీల్చే పురుగులను నియంత్రించడానిధికి అంతర వాహిక కీటక నాశినిని సంవత్సరానికి రెండుసార్లు పిచికారీ చేయాలీ. గొంగళి పురుగును నియంత్రిచడానికి స్పర్శ సంబంధితకీటక నాశిని ని పిచికారీ చేయాలి.
  • వేపకాషాయం,వేప నూనె , జీవ సంధితశిలింద్ర నాశిని ని పిచికారీ చేయడం వలన రసం పీల్చే పురుగులను నివారించవచ్చు.
  • త్రికోడెర్మా వీరిది, సూడోమోనాస్ ఫ్లోరోసెంస్. భూమి లో కలిపినట్టే , నారుకుళ్లు తెగులు ,వేరుకుళ్లు తెగులు ను  నియంత్రిచవచ్చు.

పంటకోత మరియు  దిగుబడి

నోని పండ్లు తెల్లరంగులోనికి మారుతున్నప్పుడు ,మృదువుగా ఉండి,పండిన పండ్ల నుండి వాసన వెదజల్లుతూ  ఉంటుంది . ఆ సమయంలో పండ్లను  కోత కోయాలి . పంట దిగుబడి 3 సంవత్సరాలువయస్సు   నుండి మొదలవుతుంది.   5 సంవత్సరాల  వయస్సు     గల చెట్టు నుండి అధిక దిగుబడి పొందవచ్చు. నోని రకాలు ,పండించే వాతావరణం ,నేల ను బట్టి దిగుబడి మారుతుంది. సంవత్సరానికి సగటున ౩౦౦౦౦ కె.జి./ హే. లేదా అంతకంటే ఎక్కువ దిగుబడి లభిస్తుంది.

నోని ఉపయోగాలు

  • నోని పండు తినడం వలన అనేక పోషకాలు లభిస్తుంది. అనేక జబ్బులను తగ్గిస్తుంది .
  • నోని పండులో స్కోలోప్ల్లెటిన్,ఖ్సిరాలిన్అనే పదార్థాలు ఉంటాయి,వీటి వలన అధిక రక్తపోటు ,గుండె సంబంధిత వ్యాధులు అదుపులో ఉండడానికి సహాయ పడుతుంది.
  • కీళ్లసంభందితవ్యాధులుతగ్గుతుంది . అలర్జీ,మంట వంటివి తగ్గిస్తుహ్నిది .వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది.ఋతు సంభందిత హార్మోనులు సమస్యను అదుపులో ఉంచుతుంది .
  • నోని కషాయం త్రాగడం వలన మలేరియా ,జ్వరం,కామెర్లు తగ్గుతుంది.నొని పండులో మెగ్నీషియం ధాతువు ఎక్కువగా ఉంటుంది .దీని వలన ఆస్త్మా ,గుండె సంభందిత వ్యాధులు రావు.
  • బెరడునుండిఎర్రటివర్ణం, కాండం నుండి పసుపు వర్ణం లభిస్తుంది ,దీనిని రంగులు తయారీలో ఉపయోగిస్తారు .
  • నోని విత్తనాలు నుండి వచ్చే నూనెను వాడటం వలన చర్మ సంబంధిత వ్యాధులు రావు. ఈ నూనెలో క్రిమిసంహారక లక్షణాలు కూడా ఉన్నాయి.

Writers:

N.JHANSIRANI

Ph.D. scholar Dept. of Plant Pathology, University of Horticultural Sciences, Bagalkot, Karnataka.

M.S.V. Satyanarayana Ph.D. scholar, Dept. of Plant Pathology, Central Agricultural University, Umaim, Meghalaya.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here